మహిళల కోసం ‘రైటర్ పద్మభూషణ్’ టీం కీలక నిర్ణయం

Writer Padmabhushan Movie Team Announce Provide Free Show For Women - Sakshi

కలర్‌ ఫోటో ఫేమ్‌ సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్‌ పద్మభూషన్‌’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని విజయవంతంగా కొనసాగుతుంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, నేషనల్‌ క్రష్‌ రష్మిక సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.  ఫ్యామిలీ ఆడియన్స్ తప్పక చూడాల్సిన చిత్రమని కామెంట్‌ చేశారు. తాజాగా మహిళల కోసం రైటర్ పద్మభూషణ్ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది.

రేపు(ఫిబ్రవరి 8) తెలుగు రాష్ట్రాలలోని మహిళలకు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తామని ప్రకటించింది. 38 థియేటర్లలో రైటర్ పద్మభూషణ్ చిత్రం నాలుగు షోలు ఉచితంగా ప్రదర్శిస్తామని వెల్లడించింది. 60 నుంచి 70 వేల మంది మహిళలకు ఫ్రీగా చిత్రాన్ని చూపించబోతున్నామని నిర్మాత శరత్‌ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో పాసులు ఇస్తామని చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top