రైటర్ పద్మభూషణ్ సినిమాను చాలా ఎంజాయ్ చేశా: మహేశ్ బాబు

సుహాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమా అయినా మంచి కంటెంట్‌తో పాటు చక్కని సందేశం ఉండడంతో ఈ సినిమాకు స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంపై సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని.. సుహాస్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాగే దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డిని కృషిని ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
మహేష్ బాబు ట్వీట్‌లో రాస్తూ.. ’రైటర్ పద్మభూషణ్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా. హార్ట్ టచింగ్‌గా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయింది. కుటుంబంతో కలిసి తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో సుహాస్ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్న శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్ అండ్ టీమ్ అందరికీ అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు ప్రిన్స్. అలాగే హీరో సుహాస్, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని మహేశ్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Enjoyed watching #WriterPadmabhushan! A heartwarming film, especially the climax! ❤️ A must-watch for families! Loved @ActorSuhas' performance in the film!
Congratulations @SharathWhat, @anuragmayreddy, @prasanthshanmuk & the entire team on its huge success 👍👍👍 pic.twitter.com/yCg2MEKpiY
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2023
ఏడ్చేసిన సుహాస్
రైటర్ పద్మభూషణ్‌పై మహేశ్ బాబు ప్రశంసలు కురిపించడంతో హీరో సుహాన్ భావోద్వేగాలను ఆపుకోలేక పోయాడు. ఈ ఆనందకర క్షణాలను తట్టుకోలేక ఏడ్చేశాడు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు సుహాస్.
Team : Endhuku Edusthunav?
Me : Emo Vacchesthundhi 🥹
Super Size Thank you Sir🙏. Happy tears ❤️ https://t.co/DUHyhZqyjN— Suhas 📸 (@ActorSuhas) February 6, 2023
మరిన్ని వార్తలు :