హాలీవుడ్‌ స్టార్‌ సాహసం.. బుర్జ్‌ ఖలీఫా భవనం ఎక్కి..

Will Smith Bravely Climbs To The Top Of Burj Khalifa - Sakshi

హాలీవుడ్‌ స్టార్‌ విల్‌ స్మిత్‌ ఓ సాహసకృత‍్యం చేసి తన అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా పైకి ఎక్కాడు. 2,909 మెట‍్ల ద్వారా 160 అంతస్తును చేరుకున్నాడీ బ్యాడ్‌ బ్యాయ్స్‌ హీరో. అతని బరువు తగ్గించే విధానాన్ని డాక్యుమెంట్ రూపంలో చిత్రీకరిస్తున్నాడు విల్‌. 'బెస్ట్‌ షేప్ ఆఫ్‌ మై లైఫ్‌' అనే కొత్త యూట్యూబ్‌ సిరీస్‌లో భాగంగా బుర్జ్‌ ఖలీఫా ఎక్కినట్టు పేర్కొన్నాడు. 2,909 మెట్ల ద్వారా చివరి అంతస్తును చేరుకునే సరికి తన కార్డియో వర్క్‌అవుట్‌ పూర్తయిందని తెలిపాడు. 160 అంతస్తులు ఉన్న ఈ భవనం పెకి ఎక్కడానికి 51 నిమిషాలు పట్టిందట. 

బుర్జ్‌ ఖలీఫాలో ముందుకు సాగుతున్నప్పుడు చెమటలు పట్టి అలసిపోయాడు. 160వ అంతస్తు చేరుకున్నప్పుడు, అతను సాధించేది ఇంకా ఉందని అనుకున్నాడట. హార్నెస్‌, హెల్మెట్‌ కట్టుకుని నిచ్చెన ద‍్వారా శిఖరంపైకి ఎక్కాడు. శిఖరంపైకి చేరుకున్నాక 'భూమిపై మానవులు నిర్మించిన వాటిలో మనుషులు ఉండగల వ్యక్తిగత స్థానం' అని విల్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే విల్‌ స్మిత్‌ యూట‍్యూబ్‌ సిరీస్‌ గ్రామీ అవార్డ్‌ గెలుచుకున్న నటుడు ఫిట్‌నెస్‌, ఆరోగ్యం ప‍్రయాణంపై ఉంటుందట. 'బెస్ట్‌ షేప్‌ ఆఫ్‌ మై లైఫ్‌' మొదటి రెండు ఎపిసోడ్‌లు నవంబర్‌ 8న విడుదలయ్యాయి. మిగిలిన 4 ఎపిసోడ్‌లు విల్‌ స్మిత్‌ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రతిరోజు ప్రదర్శితమవుతాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top