Watch: Aamir Khan Cried After Watched Amitabh Bachchan Jhund Movie - Sakshi
Sakshi News home page

Aamir Khan: సినిమా చూసి ఏడ్చేసిన స్టార్‌ హీరో, టీ షర్ట్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ..

Mar 2 2022 6:17 PM | Updated on Mar 2 2022 7:07 PM

Watch: Aamir Khan Cried After Watched Amitabh Bachchan Jhund Movie - Sakshi

'20 - 30 ఏళ్లుగా మనం నేర్చుకున్నదానికి ఇది బ్రేక్‌ ఇస్తుంది. వాటే ఫిలిం, మై గాడ్‌. సినిమా అత్యద్భుతంగా ఉంది. ఇండియాలోని పిల్లల ఎమోషన్స్‌ను మీరు చూపించిన విధానం చాలా బాగుంది. ఆ

బిగ్‌బీ అమితాబ్‌ నటించిన తాజా చిత్రం 'ఝండ్‌'. నాగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. తాజాగా ఈ సినిమాను ప్రైవేట్‌ స్క్రీనింగ్‌లో స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌కు చూపించింది చిత్రయూనిట్‌. ఝండ్‌ సినిమా చూడటం పూర్తవగానే ఆమిర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. '20 - 30 ఏళ్లుగా మనం నేర్చుకున్నదానికి ఇది బ్రేక్‌ ఇస్తుంది. వాటే ఫిలిం, మై గాడ్‌. సినిమా అత్యద్భుతంగా ఉంది. ఇండియాలోని పిల్లల ఎమోషన్స్‌ను మీరు చూపించిన విధానం చాలా బాగుంది. ఆ పిల్లలు కూడా చాలా బాగా నటించారు. నాకు మాటలు రావడం లేదు' అని చెప్తూ కళ్ల నుంచి ఉబికి వస్తున్న నీళ్లను టీ షర్ట్‌తో తుడుచుకుంటూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చాడు.

మూవీలో నటించిన పిల్లలను సైతం మెచ్చుకున్నాడు. అమితాబ్‌ కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందని ప్రశంసలు కురిపించాడు ఆమిర్‌. అనంతరం ఝండ్‌ చిత్రయూనిట్‌ను ఆప్యాయంగా హత్తుకుని అభినందించాడు. కాగా మురికివాడలో నివసించే పిల్లలను ఫుట్‌బాల్‌ టీమ్‌గా ఏర్పాటు చేసిన సామాజికవేత్త విజయ్‌ బార్సే జీవిత కథ ఆధారంగా ఝండ్‌ తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 4న విడుదలవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement