బిగ్‌బాస్‌ ఫేం వీజే సన్నీ హీరోగా కామెడీ చిత్రం | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ ఫేం వీజే సన్నీ హీరోగా కామెడీ చిత్రం

Published Sat, Feb 11 2023 1:38 AM

VJ Sunny new Movie Started - Sakshi

‘బిగ్‌ బాస్‌’ తెలుగు 5 సీజన్‌ విజేత వీజే సన్నీ హీరోగా కొత్త సినిమా ఆరంభమైంది.టాలెంటెడ్ రైట‌ర్  ‘సంజయ్’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన   వి. జయశంకర్  దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొంద‌నుంది.

‘‘చక్కని వినోదం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. శుక్రవారమే రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభించాం.. సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి, రేఖ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్‌ రెడ్డి, సంగీతం: మదీన్, దర్శకత్వ పర్యవేక్షణ: వి. జయశంకర్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement