'విశ్వంభర' విడుదలకు ఇదే ఛాన్స్‌.. లేదంటే వచ్చే ఏడాదే..! | Chiranjeevi Upcoming Movie Vishwambhara Will Release Next Year? Check Out More Details | Sakshi
Sakshi News home page

'విశ్వంభర' ఈ ఏడాది కష్టమే

Jul 1 2025 9:31 AM | Updated on Jul 1 2025 10:37 AM

Vishwambhara Will Release Next Year

చిరంజీవి 'విశ్వంభర' ( Vishwambhara) సినిమా 2023  అక్టోబర్‌ నెలలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.. కానీ, పలు కారణాలతో వాయిదా వేశారు. అయితే, ఇప్పటికీ విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్‌ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో ఉన్నారు. దర్శకుడు వశిష్ఠ(Mallidi Vassishta) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదల కష్టమే అని తెలుస్తోంది.  జులై-ఆగష్టు నెల దాటితే వచ్చే ఏడాది సమ్మర్‌లోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రావచ్చని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది.

విశ్వంభర టీజర్‌లో చూపించిన గ్రాఫిక్స్‌పై చిరు అభిమానుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. వీఎఫ్‌ఎక్స్‌ పనుల విషయంలో భారీగా ట్రోల్స్‌ రావడంతో విశ్వంభరకు గ్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో సినిమా మరింత ఆలస్యం అయింది. ఈ ఏడాది దసరాకు విశ్వంభరను విడుదల చేయలేరు. ఆ సమయంలో అఖండ2, ఓజీ చిత్రాలు ఉన్నాయి. దీపావళీకి ఇప్పటికే చాలా సినిమాలు లాక్‌ అయిపోయాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలో విడుదల చేద్దామంటే వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి- చిరు సినిమా జనవరి 10 స్లాట్‌ను బుక్ చేసుకుంది. 

తక్కువ గ్యాప్‌లో  ఇలా రెండు సినిమాలు వస్తే మార్కెట్‌ మీద ప్రభావం చూపొచ్చు. అందుకే విశ్వంభరకు కష్టాలు ఎక్కువ అయ్యాయి. చూస్తుంటే 2026 సంక్రాంతికి మెగా 157 ముందు రిలీజై ఆ తర్వాత తాపీగా విశ్వంభర వస్తుందనే కామెంట్స్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. విశ్వంభర టీజర్‌లో వచ్చిన విమర్శల వల్ల దర్శకుడు వశిష్ట కూడా మరింత అలర్ట్‌ అయిపోయాడట. చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఛాన్స్‌ వచ్చినప్పుడు దానిని కాపాడుకోవాలని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పగలు రాత్రి విశ్వంభర కోసం పనిచేస్తున్నారట. విడుదల ఆలస్యం అయినా సరే భారీ హిట్‌ కొట్టాలని ఆయన ప్లాన్‌ చేస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement