ఈ సమయం దాటితే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే | Vishwak Sen Gaami Trailer Out Now | Sakshi
Sakshi News home page

Gaami Trailer: ఈ సమయం దాటితే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే

Feb 29 2024 7:32 PM | Updated on Feb 29 2024 7:36 PM

Vishwak Sen Gaami Trailer Out Now - Sakshi

విశ్వక్‌సేన్‌ హీరోగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గామి'. వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ దీనిని నిర్మించారు. ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌ ఇప్పటికే సూపర్‌ అని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో శంకర్‌ అనే అఘోరా పాత్రలో విశ్వక్‌సేన్‌ కనిపించనున్నారు.

నేనెవరో..? అసలు ఎక్కడి నుంచి వచ్చానో..? నాకీ సమస్య ఎప్పటి నుంచి ఉందో..? ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. అంటూ పలు ప్రశ్నలతో విశ్వక్‌సేన్ వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. ట్రైలర్‌లోని సంభాషణలు అన్ని సస్పెన్స్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఎవరూ టచ్ చేయని కథతో విశ్వక్‌ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌తోనే సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన డైరెక్టర్‌..  సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త చరిత్ర క్రియేట్‌ చేసేలా కనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో అనుకున్న కార్యం చేయలేకపోతే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే అనే డైలాగ్‌ సనిమాకు మూలం కానుంది.

అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు గామి చిత్రంలో ఉంటాయి. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్‌ సుమారు మూడు నిమిషాలకు పైగానే ఉంది.  చాందిని చౌదరి కథానాయికగా ఉంది. క్రౌడ్‌ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్‌ శబరీష్‌ నిర్మాత‌గా ఉన్నారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్‌ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement