విష్ణు విశాల్ క్రైమ్ థ్రిల్లర్‌.. ఆసక్తిగా తెలుగు టీజర్ | Vishnu Vishal Latest Movie Telugu Teaser Out now | Sakshi
Sakshi News home page

Vishnu Vishal: పోలీస్ ఆఫీసర్‌గా విష్ణు విశాల్.. ఆసక్తిగా క్రైమ్ థ్రిల్లర్‌ టీజర్

Sep 30 2025 8:09 PM | Updated on Sep 30 2025 9:18 PM

Vishnu Vishal Latest Movie Telugu Teaser Out now

కోలీవుడ్‌ నటుడు విష్ణు విశాల్‌ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఆర్యన్‌. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో  శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించనున్నారు. టీజర్ చూస్తుంటే కథ మొత్తం హత్యలు, ఇన్వెస్టిగేషన్‌ చుట్టే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement