
షాహిద్ కపూర్ హీరోగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. 1990 నేపథ్యంలో ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో మాఫియాతో పాటుగా ప్రేమ సన్నివేశాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయని బాలీవుడ్ సమాచారం. ఇందుకు తగ్గట్లుగా విశాల్ భరద్వాజ్ నటీనటుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలోని హీరోయిన్స్ పాత్రల కోసం త్రిప్తి దిమ్రి, దిశా పటానీలను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి జోడీగా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో విక్రాంత్ మెస్సే, రణ్‌దీప్ హుడా, నానా పటేకర్, అవినాష్ తివారి నటించనున్నారని సమాచారం. షాహిద్ కపూర్, విక్రాంత్ మెస్సే, రణ్‌దీప్ హుడా వంటి పాపులర్ హీరోలు ఈ సినిమాలో భాగం కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడుతున్నాయి.