సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్‌..

Published Thu, Feb 8 2024 9:30 AM

Viraj Ashwin Joruga Husharuga Streaming on This OTT Platform - Sakshi

'బేబి' సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు హీరో విరాజ్‌ అశ్విన్‌. ఈ మూవీ తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జోరుగా హుషారుగా. అనుప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పూజిత పొన్నాడ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. నిరీష్‌ తిరువిధుల నిర్మించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‌ 15న విడుదలైంది.

హీరోహీరోయిన్ల లవ్‌ స్టోరీతోపాటు తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది థియేటర్లలో పెద్దగా వర్కవుట్‌ కాలేదు. తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలో ‍ప్రత్యక్షమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథేంటంటే..
సంతోష్‌ (విరాజ్‌ అశ్విన్‌) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తండ్రి (సాయికుమార్‌) రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు తెగ కష్టపడతాడు. సంతోష్‌ బాస్‌ ఆనంద్‌ (మధు నందన్‌)కు 35 ఏళ్లొచ్చినా పెళ్లి కాలేదు. ఇంతలో హీరో ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ).. చెప్పాపెట్టకుండా ఇతడి ఆఫీసులోనే జాయిన్‌ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో బాస్‌.. ఆమెతో ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది? సంతోష్‌ అప్పు తీర్చాడా? తన లవ్‌స్టోరీ సాఫీగా ముందుకు వెళ్లిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!

చదవండి: ‘యాత్ర 2’ టాక్‌ ఎలా ఉందంటే..
సంగీత దర్శకుడు కన్నుమూత, వందకు పైగా సినిమాలకు..

Advertisement
 
Advertisement
 
Advertisement