
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’ సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.
మనిషి మనుగడకు నమ్మకమే పునాది. మనం నమ్మిన సిద్ధాంతమే మనల్ని నడిపిస్తుంది. కానీ ఆ నమ్మకం మూఢ నమ్మకం కాకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా మూఢనమ్మకాల వల్ల చాలా చోట్ల జరగరానివి జరుగుతుండడం ఆందోళనకరం. మూఢనమ్మకం మూర్ఖత్వమేనని చెప్పేదే ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’(Viraatapalem PC Meena Reporting) సిరీస్. జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ కథాంశమంతా దాదాపు మూఢనమ్మకాల మీదే కొనసాగుతుంది. అలాగే సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ రేపుతుందనడంలో సందేహం లేదు.
ఇక కథాంశంలోకి వస్తే... 1980 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరులో జరిగిన కథే ఈ సిరీస్. ఆ ఊరిలో పెళ్ళైన మొదటిరాత్రే పెళ్ళికూతుళ్ళు రక్తపు వాంతులు చేసుకుని చనిపోతుంటారు. దాదాపు పది సంవత్సరాల నుండి ఇలానే ఊళ్ళో జరగడం చూసి ఊళ్ళోని జనాలు తమ ఊరికి పెద్ద శాపం తగిలిందనుకుని కుమిలి΄ోతుంటారు. అంతేకాదు... ఆ ఊళ్ళో పెళ్ళి చేసుకోవడానికి కూడా జంకుతుంటారు. ఇదే సమయంలో ఆ ఊరికి కానిస్టేబుల్ మీనా కొత్తగా ట్రాన్స్‌ఫరై వస్తుంది. ఇలా పెళ్ళి కూతుళ్ళు చనిపోవడం చూసి మీనా దీనిపై విచారణ ప్రారంభిస్తుంది. ఒక దశలో విచారణ ఏదీ కొలిక్కి రానందున తానే పెళ్ళి పీటలెక్కి విచారణను వేగవంతం చేస్తుంది.
పెళ్ళి చేసుకోబోతున్న మీనా కూడా తాళి కట్టించుకున్న తరువాత రక్తపు వాంతులు చేసుకుంటుంది. ఆ తరువాత కథ అనుకోని మలుపులు తిరుగుతుంది. మరి... పెళ్ళి కూతురు అయిన మీనా ఈ కేసును సాల్వ్ చేయగలిగిందా? అసలు ఈ పెళ్ళి కూతుళ్ళు చని΄ోవడానికి కారణం ఆ ఊరికి పట్టిన శాపమేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘విరాట΄ాలెం–పీసీ మీనా రి΄ోర్టింగ్’ సిరీస్ చూడాల్సిందే. చిన్న కథతో ఉత్కంఠ రేపే ΄ాయింట్‌తో ఊహకందని ట్విస్టులతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించే ఈ సిరీస్ చూడదగినదే. పిల్లలు లేకుండా పెద్దలు చూడగలిగే ఈ సిరీస్ వాచబుల్ ఫర్ ది వీకెండ్.
– హరికృష్ణ ఇంటూరు