విక్రమార్కుడు పాప.. ఇప్పుడు ఇంత అందంగానా

Vikramarkudu Child Artist Neha Thota Present Look Goes Viral - Sakshi

సినీ పరిశ్రమలోకి చైల్డ్‌ ఆర్టిస్టులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే తమదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. చేసింది ఒకట్రెండు సినిమాలైనా వారి ముద్దుముద్దుమాటలు, చేష్టలతో ఆ పాత్రలకు ప్రాణం పోస్తారు. అలాంటి అతి కొద్ది మంది చైల్డ్‌ ఆర్టిస్ట్‌లలో నేహా తోట ఒక్కరు. నేహా తోట అంటే గుర్తుపట్టకపోవచ్చ కానీ, విక్రమార్కుడులో నటించిన చిన్నారి అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో అమాయకమైన చూపులతో అందరిని ఆకట్టుకుంది. తల్లిలేని పిల్లగా అద్భుతమైన నటన ప్రదర్శించింది.  అలాగే రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్ష’ సినిమాలో దెయ్యం పట్టిన పాత్రలో నటించి అందరిని భయపెట్టింది. ఆ సినిమాలో నేహ పాత్ర అమోఘమనే చెప్పాలి. తన నటనతో ఆర్జీవీనే మెప్పించింది.

ఆ తర్వాత అనసూయ, రాముడు వంటి చిత్రాల్లో కూడా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత మళ్లీ తెరపైన కనపడలేదు. సినిమా చాన్సులు వచ్చినా కాదనుకుని చదువుపై శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు బిజినెస్ మేనేజ్మెంట్‌లో ఎంబీఏ చేస్తుంది.  ఇప్పుడు అయితే అసలు గుర్తుపట్టనంతగా మారిపోయింది నేహ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా తన ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతోంది. హీరోయిన్‌లా ఉన్నావ్‌.. సినిమాలు ఎందుకు చేయట్లేదని నెటిజన్లు ప్రశ్నిస్తే.. ..స్టడీస్ కంప్లీట్ అయ్యాక సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని,దానికి ఇంకా టైం ఉందని  చెప్తోంది నేహ. నటన అంటే తనకు ఇష్టమని భవిష్యత్తులో తప్పకుండా సినిమాలు చేస్తానని చెబుతోంది. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top