భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ.. క్రేజీ అప్‌డేట్‌! | Sakshi
Sakshi News home page

Thangalaan Movie: చియాన్ విక్రమ్‌ 'తంగలాన్'.. హీరోయిన్‌ లుక్ చూశారా?

Published Sun, Apr 7 2024 5:15 PM

Vikram Thangalaan Movie Heroine Parvathy Thiruvothu First Look - Sakshi

చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందించారు.  పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్ డే సందర్భంగా తంగలాన్‌లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే మహిళా రైతు క్యారెక్టర్‌లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తంగలాన్ సినిమాను త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చియాన్ విక్రమ్‌ను విభిన్నమైన క్యారెక్టర్‌లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..తంగలాన్‌'  రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నాప్పటికీ కుదరలేదు.  త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement