'మహారాజ' కలెక్షన్స్‌.. దుమ్మురేపిన విజయ్‌సేతుపతి | Maharaja Movie Box Office Collection Day 4 | Sakshi
Sakshi News home page

నాలుగురోజుల్లో 'మహారాజ' కలెక్షన్స్‌.. దుమ్మురేపిన విజయ్‌సేతుపతి

Published Tue, Jun 18 2024 1:41 PM | Last Updated on Tue, Jun 18 2024 3:05 PM

Vijay Sethupathi Maharaja Collections In Four Days

సౌత్‌ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహారాజ'.  క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా నిథిలన్‌ ఈ మూవీని తెరకెక్కించారు. అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి,భారతీరాజా, మమతా మోహన్‌దాస్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ సేతుపతి కెరియర్‌లో 50వ చిత్రంగా జూన్‌ 14న మహారాజ విడుదలైంది.

మహారాజ చిత్రం విడుదల సమయంలో ఎలాంటి అంచనాలు లేవు. కానీ, మొదటిరోజు తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా చాలా బాగుందంటూ కితాబు ఇవ్వడంతో బాక్సాఫీస్‌ వద్ద మహారాజ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌​ ప్రముఖ దర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. రోజురోజుకి కలెక్షన్స్‌ పెరుగుతుండటంతో పంపిణీదారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహారాజ కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 40కోట్లకు పైగానే గ్రాస్‌ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. తెలుగులోనే రూ. 10 కోట్ల వరకు కలెక్షన్స్‌ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ బార్బర్‌గా నటించి మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. నేటి సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చే చిత్రంగా మహారాజ ఉందని ఎక్కువ మంది చెప్పుకొస్తున్నారు. మహారాజ ఓటీటీ డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు మంచి ఆదరణ వస్తుండటంతో ఓటీటీ డీల్‌ కూడా భారీగానే సెట్‌ అయినట్లు తెలుస్తోంది.జులై రెండో వారంలో ఓటీటీలోకి మహారాజ విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement