తప్పుకున్న సేతుపతి

Vijay Sethupathi leaves Muttiah Muralitharan biopic 800 - Sakshi

శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి టైటిల్‌ రోల్‌ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. అయితే తమిళ నాట ఈ సినిమా విషయంలో వివాదం మొదలైంది. శ్రీలంక ఆటగాడు అయినప్పటికీ మురళీధరన్‌కు తమిళ మూలాలున్నాయి. అయితే తమిళ ఉద్యమానికి సంబంధించిన విషయాల్లో మురళీధర న్‌ తమిళుల వైపు ఎప్పుడూ నిలబడలేదనే వివాదం తెరమీదకొచ్చింది.

అందుకే విజయ్‌ సేతుపతి ఈ సినిమా చేయకూడదని సోషల్‌ మీడియాలో పలువురు హల్‌చల్‌ చేశారు. కొందరు తమిళ సినీ ప్రముఖులు కూడా విజయ్‌ సేతుపతి ఈ సినిమా చేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. అందులో సీనియర్‌ దర్శకులు భారతీరాజా, చేరన్‌ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్నారు. ఈ విషయాన్ని మురళీధరన్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘నా వల్ల నీలాంటి గొప్ప నటుడు ఇబ్బంది పడటం కరెక్ట్‌ కాదు. ఎటువంటివంటి ఇబ్బందులు పడొద్దు’ అని ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ‘ధన్యవాదాలు’ అని సమాధానమిచ్చారు విజయ్‌ సేతుపతి. ఇప్పుడు విజయ సేతుపతి స్థానంలో ఎవరొస్తారో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top