Liger Promotions: Vijay Devarakonda Wrap Up Koffee With Karan Show Details Inside - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ప్రముఖ బాలీవుడ్‌ షోలో విజయ్‌ దేవరకొండ.. క్రేజ్‌ తగ్గేదేలే!

May 30 2022 6:56 PM | Updated on May 30 2022 7:28 PM

Vijay Devarakonda Wrap Up Koffee With Karan Show Liger Promotions - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకోవడంతో పాటు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా విడుదల చేయలేదు. తాను నటించిన చిత్రలేవీ బాలీవుడ్‌లో హైప్‌తో విడుదల అవ్వలేదు. తాజాగా పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన చిత్రం ‘లైగర్‌’. ఈ మూవీపై అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్​ను మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్‌ షోలో కనిపించనున్నారు విజయ్‌, లైగర్‌ భామ అనన్య పాండే. బాలీవుడ్‌లో కొన్ని షోలు అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో ఒకటి కాఫీ విత్ కరణ్. కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి అక్కడ విపరీతమైన క్రేజ్‌ కూడా ఉంది. అయితే ఈ షోకు ఇప్పటివరకు టాలీవుడ్‌ నుంచి డార్లింగ్‌ ప్రభాస్, రానా మాత్రమే వెళ్లారు. వీరి తర్వాత విజయ్ దేవరకొండ ఈ లిస్ట్‌లో చేరనున్నాడు. దీనికి సంబంధించి ఈ షోలో పాల్గొన్నట్టు తెలియజేసే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

చదవండి: Anchor Vishnu Priya: హీరోయిన్‌ అవ్వకుండానే చచ్చిపోతానేమోనని భయపడ్డా

Advertisement
 
Advertisement
Advertisement