Vijay Devarakonda Tweet On Adivi Sesh Major Movie After Watching - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda-Major Movie: అడివి శేష్‌ ‘మేజర్‌’ మూవీ చూసిన విజయ్‌ ఏమన్నాడంటే

Jun 7 2022 9:17 PM | Updated on Jun 8 2022 8:34 AM

Vijay Devarakonda Tweet On Adivi Sesh Major After Watching Movie - Sakshi

Vijay Devarakonda Tweet On Adivi Sesh Major Movie: శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో అడివిశేష్‌ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్‌’. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణణ్‌ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 3న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీపై అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌ ప్రశంసలు గురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మరో యంగ్‌ హీరో మేజర్‌ మూవీపై రివ్యూ ఇచ్చాడు.

చదవండి: అర్జున్‌ కపూర్‌ బాడీ షేప్‌పై ట్రోల్స్‌, ఘాటుగా స్పందించిన లవ్‌బర్డ్స్‌

హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని చూసిన రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ మేజర్‌ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్‌ చేశాడు. ‘మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతం. దేశభక్తి విషయంలో ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నిజంగా ఇలాంటి వీర పుత్రుడిని కన్న మేజర్‌ సందీప్ తల్లిదండ్రులు గొప్పవారు. ఈ సినిమాలో చిత్ర బృందం ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ కనిపించించాయి. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు’ అంటూ విజయ్‌ రాసుకొచ్చాడు. కాగా విజయ్‌ ప్రస్తుతం జనగనమన, ఖుషి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు అతడు నటించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌ అగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది.

చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో ల్యాండయిన సల్మాన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement