Salman Khan: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో ల్యాండయిన సల్మాన్‌

Is Salman Khan Lands in Hyderabad For a Movie Shoot After Death Threat - Sakshi

Salman Khan Lands in Hyderabad: బాలీవుడ్‌ ‘భాయిజాన్‌’ సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.  గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సల్మాన్‌ చంపేది తనేనంటూ 2018లో చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇటీవల బయటకు వచ్చింది. అప్పటి నుంచి అతడి కామెంట్స్‌ కలకలం రేపుతున్న తరుణంలో సల్మాన్‌కు బెదిరింపు లేఖ రావడం సంచలనంగా మారింది.

చదవండి: ‘విక్రమ్‌’ భారీ విజయం, దర్శకుడికి కమల్‌ లగ్జరీ కారు బహుమతి

ఈ లేఖలో సల్మాన్‌తో పాటు అతడి తండ్రి సలీమ్‌ను సైతం చంపుతామని, పంజాబ్‌ సింగర్‌ సిద్ధూకు పట్టిన గతే హీరోకు కూడా పడుతుందని అందులో హెచ్చరించారు. ఈ లేఖతో అప్రమత్తమైన సల్మాన్‌ ఆదివారం బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ లేఖలో బి-టౌన్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. సల్మాన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ సల్మాన్‌ సీక్రెట్‌గా హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ ప్రస్తుతం ఫర్హద్‌ సామ్‌జీ దర్శకత్వంలో కభీ ఈద్‌ దివాళి చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగానే సల్మాన్‌ హైదరాబాద్‌లో చేరుకున్నట్లు సమాచారం.

చదవండి: ఇండియన్‌ రెస్టారెంట్‌లో జానీ డెప్‌ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు

హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ను జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌ షెడ్యుల్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్టరి వెంకటేశ్‌ కూడా పాల్గొనన్నాడని సినీవర్గాల నుంచి సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్‌ నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ కీ రోల్‌ పోషిస్తున్నాడు. బెదిరింపులు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా సల్మాన్‌ చురుగ్గా షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. దీంతో ఆయన ఫ్యాన్స్‌ భాయిజాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే జాగ్రత్త భాయ్‌ స‌ల్లూభాయ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top