ఎవరినైనా కొట్టగలగాలి

Vijay Devarakonda to resume Fighter in Bangkok - Sakshi

‘‘ఫైటర్‌ నా తరహా కమర్షియల్‌ సినిమాగా తయారవుతోంది. మామూలుగా మనం చూసే, చూస్తూ పెరిగిన రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కాదు. ఈ స్క్రిప్ట్‌ విన్నప్పుడు, కమర్షియల్‌ జానర్‌లోకి వచ్చే ఇలాంటి సినిమానే చెయ్యాలనుకున్నాను. కమర్షియల్‌ సెన్సిబిలిటీస్‌కు పేరు పొందిన పూరి జగన్నాథ్‌గారు డైరెక్టర్‌ కావడం వల్ల ఈ సినిమాకి మరింత వాణిజ్య మద్దతు లభించింది’’ అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు.  పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘ఫైటర్‌’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంతో అనన్యా పాండే హీరోయి¯Œ గా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. చార్మీ కౌర్, కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో పునఃప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఫైటర్‌ రోల్‌ చేస్తున్నాను. ఎవరినైనా కొట్టగల ఫైటర్‌లా కనిపించాలి. అందుకే ఎనిమిది నెలలుగా నేను వర్కవుట్స్‌ చేస్తున్నాను. ఈ మధ్య నేను మోటివేషన్‌ కోల్పోయాను. కానీ తర్వాత నన్ను నేను మోటివేట్‌ చేసుకొని నా¯Œ స్టాప్‌గా  వర్కవుట్‌ చేస్తున్నాను. పూరి జగన్నాథ్‌గారు నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయన సినిమాల్లో ‘పోకిరి’ నా ఫేవరేట్‌ ఫిల్మ్‌’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top