ఆస్పత్రిలో విజయ్‌ దేవరకొండ.. ఎందుకంటే? | Vijay Devarakonda Hospitalised due to Dengue | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ఆస్పత్రిలో చేరిన విజయ్‌ దేవరకొండ

Jul 17 2025 7:10 PM | Updated on Jul 17 2025 7:18 PM

Vijay Devarakonda Hospitalised due to Dengue

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఆస్పత్రిపాలయ్యాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. విజయ్‌ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన కొత్త చిత్రం కింగ్‌డ‌మ్ (Kingdom Movie). గౌతం తిన్న‌నూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 31న రిలీజ్ కానుంది. ఈ మూవీలో భాగ్య‌శ్రీ బోర్సే, స‌త్య‌దేవ్ న‌టించారు. 

సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ఫార్చూన‌ర్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. మరోవైపు విజయ్‌కు బాలీవుడ్‌ మూవీలో విలన్‌గా నటించే ఆఫర్‌ వచ్చింది. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టిస్తున్న డాన్ 3 చిత్రంలో విల‌న్ పాత్ర‌ కోసం రౌడీ హీరోను సంప్రదించారు. అయితే ఈ ఆఫర్‌కు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: థగ్‌ లైఫ్‌.. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు: బాలీవుడ్‌ నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement