దిల్‌ రాజుతో మూడు.. ‘మైత్రీ’లో రెండు... రౌడీ హీరో జోరు! | Vijay Devarakonda Do Three Films With Dil Raju, Two Films With Mythri Movie Makers, Deets Inside - Sakshi
Sakshi News home page

దిల్‌ రాజుతో మూడు.. ‘మైత్రీ’లో రెండు... రౌడీ హీరో జోరు!

Published Sat, Sep 30 2023 5:04 PM

Vijay Devarakonda Do Three Films With Dil Raju, Two Films With Mythri Movie Makers - Sakshi

విజయ్ దేవరకొండ వరసగా సినిమాలకు సైన్‌ చేస్తున్నాడు. మొన్నటి వరకు..సంవత్సరానికి ఓ సినిమాతో పలకరించేవాడు.వచ్చే ఏడాది నుంచి..రెండు సినిమాలతో అలరించేలా ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్లతో పాటు,బిగ్ బ్యానర్లలో మూవీస్‌ చేయటానికి పచ్చజెండా ఊపాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి.పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు,గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు.పరుశురామ్‌ మూవీని దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు.ఈయన బ్యానర్‌లోనే మరో రెండు మూవీస్‌కి కూడా సైన్‌ చేసాడట విజయ్. ఓ మూవీని రవి కుమార్‌ కొల్లా అనే దర్శకుడు రూపొందిస్తే,మరో మూవీని ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి

దిల్‌ రాజు బ్యానర్‌లో మూడు సినిమాలు చేస్తు..మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో మరో రెండు సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడని సమాచారం.అలాగే ఓ మలయాళ దర్శకుడు కూడా రౌడీ హీరోకి స్టోరీ వినిపించి ఒకే చేయించుకున్నాడట.ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేయబోతున్నాడు .వెంట వెంటనే థియేటర్లలో సందడి చేస్తూ..అభిమానులను హ్యాపీగా ఉంచాలని ఫిక్స్ అయ్యాడట విజయ్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement