Vijay Deverakonda Wishes Director Sukumar on His Birthday - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda Sukumar: సుక్కు విజయ్‌ కాంబోలో మూవీ ! విషెస్‌తో హింట్‌ ఇచ్చిన రౌడీ హీరో

Jan 11 2022 7:42 PM | Updated on Jan 11 2022 8:19 PM

Vijay Devarakonda Birthday Wishes To Sukumar - Sakshi

Vijay Devarakonda Birthday Wishes To Sukumar: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ పుట్టినరోజు నేడు (జనవరి 11). ఈ సందర్భంగా ఆయనపై సినీ తారలంతా తమ శుభాకాంక్షలతో విష్ చేస్తున్నారు. సుక్కు స్నేహితుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఒక ప్రత్యేకమైన  గీతంతో శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇటీవల బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన 'పుష్ప' మూవీలోని శ్రీవల్లి పాటకు పేరడిగా ఈ  స్పెషల్‌ బర్త్‌డే సాంగ్‌ సాగుతుంది. తాజాగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఈ లెక్కల మాస్టారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. సోషల్‌ మీడియా వేదికగా సుక్కుకి విజయ్‌ విష్‌ చేశాడు. ఈ విషెస్‌లో కొన్ని హింట్‌లు కూడా ఇచ్చాడు ఈ 'లైగర్‌'. 

సుకుమార్‌ సర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. మీతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నా. లవ్‌ అండ్‌ హగ్స్‌ అని ట్వీట్‌ చేశాడు విజయ్‌. దీంతోపాటు '2021 ది రైజ్‌, 2022 ది రూల్‌, 2023 ది ర్యాంపేజ్‌' అని కూడా రాసుకొచ్చాడీ రౌడీ హీరో. అయితే విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ ఒక సినిమా చేయనున్నట్లు ఇది వరకు వార్తలు వచ్చాయి. పుష్ప ది రూల్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈ సినిమాకు టైటిల్‌ ఏం పెడతారో ఇప్పటివరకూ తెలీదు. కానీ విజయ్‌ ట్వీట్‌తో ఆ మూవీకి ది ర్యాంపేజ్‌గా టైటిల్ పెడతారా అనే అనుమానాలు వస్తున్నాయి. 
 

మరీ సుక్కు విజయ్‌ కాంబోలో వచ్చే సినిమాకు ఏ టైటిల్‌ పెట్టనున్నారో మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం మాటల గన్‌ 'పూరీ జగన్‌' దర్శకత్వం చేస్తున్న 'లైగర్‌' సినిమాతో విజయ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: సార్‌ స్కెచ్‌ వేస్తే..తగ్గేదె..లా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement