విజ‌య్ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్న హీరోయిన్‌ | Thalapathy 68: Vijay Wraps Thailand Schedule - Sakshi
Sakshi News home page

Vijay 68: విజ‌య్ డ‌బుల్ యాక్ష‌న్‌.. గాల్లో తేలిపోతున్న‌ హీరోయిన్‌

Nov 29 2023 10:16 AM | Updated on Nov 29 2023 10:35 AM

Vijay 68: Thailand Schedule Completed - Sakshi

యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్లు వెంకట్‌ ప్రభు తన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ చైన్నెలో జరుగుతోంది. ఈ చిత్ర కథా

నటుడు విజయ్‌ నటించిన లియో చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ వసూళ్ల వర్షం కురిపించింది. ప్ర‌స్తుతం అత‌డు తన 68వ చిత్ర షూటింగ్‌లో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్‌, ప్రభుదేవా, ప్రేమ్‌జీ, నటి స్నేహ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. చిత్ర షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ను చైన్నెలో ప్రారంభించి ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి థాయ్‌లాండ్‌లో మలి షెడ్యూల్‌ పూర్తి చేశారు. అక్కడ కీలక సన్నివేశాలను, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్లు వెంకట్‌ ప్రభు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ చైన్నెలో జరుగుతోంది. ఈ చిత్ర కథానాయిక‌ మీనాక్షీ చౌదరి.. ఈ సినిమా త‌న‌కు ఖచ్చితంగా స్పెషల్‌ చిత్రం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ఇది ట్రావెలింగ్‌ కథా చిత్రంగా ఉంటుందనే టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement