Sulochana Latkar: సినీ ఇండస్ట్రీలో విషాదం.. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత ఇకలేరు

Veteran actress Sulochana Latkar passes away at 94 - Sakshi

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సులోచన లట్కర్‌ మృతి చెందారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో ముంబయి దాదర్‌లోని సుశ్రుసా ఆసుపత్రిలో చేరిన ఆమె ఆదివారం సాయంత్ర తుదిశ్వాస విడిచారు.  1928 జూలై 30న కర్ణాటకలోని ఖడక్లాత్‌లో జన్మించిన సులోచన లట్కర్ 1946లో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 

(ఇది చదవండి: నా అవార్డులను వాష్‌రూమ్‌ డోర్‌ హ్యాండిల్స్‌గా పెట్టా: నటుడు)

సులోచన లట్కర్ 1959లో 'దిల్ దేకే దేఖో' చిత్రం ద్వారా బాలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేశారు. 1995 వరకు అనేక సినిమాల్లో నటించారు. తనదైన నటనతో ప్రేక్షకల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 'గోరా ఔర్ కాలా', 'సంపూర్ణ రామాయణం' 'జీవచా శాఖ' వంటి చిత్రాల్లో నటనకు పేరు సంపాదించారు. ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. దాదాపు 250కి పైగా  మరాఠీ చిత్రాల్లో కనిపించారు. సినీ పరిశ్రమలో ఆమె చేసిన సేవలకుగానూ పలు అవార్డులు అందుకున్నారు.  

(ఇది చదవండి: ఇలా అవుతానని కలలో కూడా ఊహించలేదు: హీరోయిన్)

సినీ ప్రపంచానికి లట్కర్ చేసిన సేవలకు గానూ 1999లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆ తర్వాత  2004లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.  ఇది చలనచిత్ర రంగంలో ఆమె స్థాయిని మరింత పెంచింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top