హీరోగా శశికుమార్‌..త్వరలోనే షూటింగ్‌ మొదలు | Veteran Actor Shashikumar Signed A Film As Hero | Sakshi
Sakshi News home page

హీరోగా శశికుమార్‌..త్వరలోనే షూటింగ్‌ మొదలు

Aug 18 2021 11:02 AM | Updated on Aug 18 2021 11:07 AM

 Veteran Actor Shashikumar Signed A Film As Hero - Sakshi

చెన్నై: చెందూర్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై టీడీ రాజా నిర్మిస్తున్న తాజా చిత్రంలో నటుడు శశికుమార్‌ కథానాయకుడిగా నటించనున్నారు. విజయ్‌ ఆంటోని హీరోగా ఈ సంస్థ నిర్మించిన కోటియిల్‌ ఒరువన్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా శశికుమార్‌ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో కథానాయికగా హరిప్రియ నటించనున్నారు. ముఖ్యపాత్రల్లో విక్రాంత్, తులసి మధుసూదన్‌ తదితరులు నటించనున్నారు. కళగు చిత్రం ఫేమ్‌ సత్యశివ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.  

చదవండి : కథ లేకుండా కామెడీ నడిపించలేం! 
అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement