హైదరాబాద్‌లో వైజాగ్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో వైజాగ్‌

Published Mon, Nov 27 2023 3:21 AM

Varun Tej Matka to go on floors in December - Sakshi

యాక్షన్  మోడ్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. ‘పలాస’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్  ఫిల్మ్‌ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. వైర ఎంటర్‌టైన్ మెంట్స్‌పై మోహన్‌ చెరుకూరి (సీవీఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబరులో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్  వర్క్స్‌కి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్‌. ‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్‌ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. 24 ఏళ్ల వ్యవధిలో (1958 –1982) జరిగే ఈ సినిమాలో వరుణ్‌ నాలుగు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నారు. 1950, 1980 నాటి వాతావరణాన్ని తలపించేలా  భారీ సెట్స్‌ను రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో ఓల్డ్‌ వైజాగ్‌ సిటీని క్రియేట్‌ చేసేందుకు ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు నలుగురు ఫైట్‌ మాస్టర్స్‌ వర్క్‌ చేస్తారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌. 

Advertisement
 
Advertisement