వరుణ్‌- లావణ్య పెళ్లి హక్కులు రూ.8 కోట్లు.. టీమ్‌ క్లారిటీ

Varun Tej, Lavanya PR Team Gives Clarity On Wedding Video Streaming On OTT Platform - Sakshi

‘మెగా ప్రిన్స్ ’వ‌రుణ్ తేజ్, ‘అందాల రాక్ష‌సి’ లావ‌ణ్య  త్రిపాఠిల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 1న ఇటలీలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడకకు మెగా ఫ్యామిలీతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కానీ ఆదివారం (నవంబర్‌ 5)న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ వేడుకకి మాత్రం వందల సంఖ్యల్లో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశ్వీరదించారు.

పార్టీకి వచ్చిన అతిధులందరితో వరుణ్, లావణ్య లు ఎంతో ఓపికగా ఫోటోలు దిగారు. ప్రస్తుతం రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటితో పాటు మరో క్రేజీ రూమర్‌ కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. అదేంటంటే.. వరుణ్‌, లావణ్య పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఓటీటీలో ప్రసారం అవుతుందట. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫిక్స్‌ రూ. 8 కోట్లకు ఈ పెళ్లి వీడియోని కొనుకోలు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే అది పుకారు మాత్రమే. పెళ్లి వీడియోని ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ చేయడం లేదని వరుణ్‌, లావణ్య పీఆర్‌ టీమ్‌ స్పష్టం చేసింది. 

‘వరుణ్‌-లావణ్యల పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు.  పెళ్లి వీడియో హక్కులను ఏ ఓటీటీ సంస్థకు అమ్మలేదు. దయచేసి అలాంటి బేస్‌లెస్‌ రూమర్స్‌ని నమ్మకండి’అని వరుణ్‌, లావణ్య పీఆర్‌ టీమ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top