లవ్‌.. హారర్‌.. కామెడీ | Sakshi
Sakshi News home page

లవ్‌.. హారర్‌.. కామెడీ

Published Thu, Nov 3 2022 4:21 AM

Varun Dhawan Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution - Sakshi

ఇటీవల హిట్‌ చిత్రం కన్నడ ‘కాంతార’ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్‌ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ త్వరలో హిందీ చిత్రం ‘భేదియా’ని విడుదల చేయనుంది. ఈ లవ్‌–హారర్‌–కామెడీ మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకున్న విషయాన్ని బుధవారం ప్రకటించింది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది.

వరుణ్‌ ధావన్, కృతీ సనన్‌ జంటగా నటించారు. కాగా ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడు భాస్కర్‌ పాత్రలో వరుణ్, డాక్టర్‌ అనిక పాత్రలో కృతి కనిపిస్తారు. ‘‘మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ తెలుగు వెర్ష¯Œ ను విడుదల చేశాం. ‘భేదియా’ కంటెంట్‌ కూడా బాగుంటుంది’’ అని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement