Varasudu Collections: వంద కోట్ల క్లబ్బులో చేరిన విజయ్‌

Varisu Box Office Collection: Vijay Film Enters Rs 100 Crore Club In India - Sakshi

దళపతి విజయ్‌ కథానాయకుడి నటించిన ద్విభాషా చిత్రం వారిసు. ఈ సినిమా వారసుడు పేరిట తెలుగులోనూ రిలీజైంది. నేషనల్‌ క్రష్‌ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేశాడు. దిల్‌ రాజు, శిరీష్‌, పరమ్‌, వి.పొట్లూరి, పెరల్‌ నిర్మించిన ఈ చిత్రం తమిళ్‌లో జనవరి 11న విడుదలవగా తెలుగులో 14న విడుదలైంది. కలెక్షన్లపరంగా రెండు చోట్లా దూసుకుపోతోందీ సినిమా. రిలీజై వారం రోజులు కూడా కాకముందే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. అటు కేరళలో, ఇటు నార్త్‌లో హిందీలోనూ రిలీజవడంతో అక్కడ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది.

ఆదివారంతో సంక్రాంతి పండగ హవా ముగియనుండటంతో వసూళ్ల మీద ఎఫెక్ట్‌ పడే అవకాశముంది. అటు అజిత్‌ తునివు, ఇటు చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు గట్టి పోటీనిచ్చినా వాటన్నింటినీ తట్టుకుని నిలబడి వారసుడు వంద కోట్లు రాబట్టడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు ఫ్యాన్స్‌. కాగా విజయ్‌కు వంద కోట్లు సాధించడం పెద్ద లెక్కేం కాదు. ఇప్పటికే అతడి తొమ్మిది సినిమాలు ఈ ఘనత సాధించగా తాజాగా వారిసు సెంచరీ కొట్టి ఆ జాబితాలోకెక్కింది. తునివు కూడా వంద కోట్ల మార్క్‌ దాటడం విశేషం.

చదవండి: రష్మిక టాటూ వెనక స్టోరీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top