పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ | Sakshi
Sakshi News home page

Varalakshmi Sarathkumar: పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Published Fri, Sep 16 2022 11:14 AM

Varalakshmi Sarathkumar Chasing Movie Completes Dubbing - Sakshi

వరలక్ష్మి చేజింగ్‌ అన్యాయాలను ఎదిరించడానికి సిన్సియర్‌ పోలీసాఫీసర్‌గా రంగంలోకి దిగారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఆమె లీడ్‌ రోల్‌లో రూపొందిన చిత్రం ‘చేజింగ్‌’. ఈ తమిళ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఏఎన్‌ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘

‘మా బేనర్లో ‘ఒరేయ్‌ బామ్మర్ది, మై డియర్‌ భూతం’ వంటి హిట్‌ చిత్రాలను అందించాం. ‘చేజింగ్‌’ మంచి యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ఏఎన్‌ బాలాజీ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: కె. వీరకుమార్‌

Advertisement
 
Advertisement
 
Advertisement