‘కళగ తలైవన్‌’గా ఉదయనిధి స్టాలిన్‌? | Udhayanidhi Stalin New Film Title As Kazhaga Thalaivan | Sakshi
Sakshi News home page

Udhayanidhi Stalin: ‘కళగ తలైవన్‌’గా ఉదయనిధి స్టాలిన్‌?

Jul 6 2022 11:54 AM | Updated on Jul 6 2022 11:54 AM

Udhayanidhi Stalin New Film Title As Kazhaga Thalaivan - Sakshi

తమిళసినిమా: ప్రస్తుతం చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ సారించినట్లు హీరో ఉదయనిధి స్టాలిన్‌ వెల్లడించారు.  ఇటీవల ఈయన నటించిన ‘నెంజిక్కు నీతి’చిత్రం ప్రేక్షకాదరణ పొందటంతో పాటు, మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా తాజాగా నటిస్తున్న చిత్రానికి కళగ తలైవన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. దీనికి మగిళ్‌ తిరువేణి దర్శకుడు. ఈయన ఇంతకు ముందు తడైయార తాక్క, మిగామన్, తడం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం.

ఇందులో నటి నిధి అగర్వాల్‌ నాయకిగా నటించారు. ఆర్థిక నేరాల ఇతివృత్తంగా, రాజకీయ నేపథ్యంలో చిత్రంగా సాగుతుందని సమాచారం. చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement