TV Actress Vaishnavi Gade Blessed With Baby Boy - Sakshi
Sakshi News home page

Vyshnavee Gade: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్‌ నటి

Mar 6 2023 3:55 PM | Updated on Mar 6 2023 4:31 PM

TV Actress Vaishnavi Gade Gives Birth to Baby Boy - Sakshi

భర్త సురేశ్‌తో నటి వైష్ణవి

కొత్త ప్రపంచంలోకి స్వాగతం మామా అంటూ చిన్నారి పాదాల బ్లూప్రింట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. అబ్బాయి పుట్టాడంటగా.. కంగ్రాచ్యులేషన్స్‌ అంటూ నటి సునంద

బుల్లితెర నటి వైష్ణవి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు విజయ్‌ సింహా సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. కొత్త ప్రపంచంలోకి స్వాగతం మామా అంటూ చిన్నారి పాదాల బ్లూప్రింట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. అబ్బాయి పుట్టాడంటగా.. కంగ్రాచ్యులేషన్స్‌ అంటూ నటి సునంద మాలశెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టగా అందుకు థ్యాంక్స్‌ అంటూ రిప్లై ఇచ్చాడు విజయ్‌ సింహా. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్‌ మీడియాలో నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా వైష్ణవి రామిరెడ్డి.. సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్‌బై చెప్పింది. కానీ అటు సోషల్‌ మీడియాలో, ఇటు యూట్యూబ్‌ వీడియోలతో నిరంతరం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంది. ఈ క్రమంలోనే గత సెప్టెంబర్‌లో తను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన సీమంతం వేడుక ఫోటోలను సైతం విడుదల చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement