Allu Arjun: అల్లు అర్జున్‌కి షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, లీగల్‌ నోటీసులు జారీ

TSRTC Sends Legal Notice to Allu Arjun And Rapido Over Rapido New Ad - Sakshi

TSRTC Sends Legal Notice to Allu Arjun: టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్టీసీ లీగల్‌ నోటీసులు ఇచ్చింది. అల్లు అర్జున్‌ రాపిడో ప్రకటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ర్యాపిడో ప్రకటన ఉందంటూ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ నోటీసులు పంపారు. ఈ మేరకు సజ్జనార్‌ ప్రకటన విడుదల చేశారు. ‘అల్లు అర్జున్‌ నటించిన ప్రకటనపై అభ్యంతరాలు వస్తున్నాయి. యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది.

చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్‌

ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారు ఖండిస్తున్నారు. టీఎస్‌ ఆర్టీసీని కించపర్చడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్‌ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది... అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్‌ నోటీసు ఇచ్చింది. బస్‌ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్‌, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం’ అని సజ్జనార్‌ తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top