జీవితంలోని ఏడురంగులను చూపించే సినిమా 'రంగ్‌ దే' | Trivikram Srinivas Speech At RangDe Pre Release Event | Sakshi
Sakshi News home page

జీవితంలోని ఏడురంగులను చూపించే సినిమా 'రంగ్‌ దే'

Mar 22 2021 12:16 AM | Updated on Mar 22 2021 12:23 AM

Trivikram Srinivas Speech At RangDe Pre Release Event - Sakshi

వెంకీ అట్లూరి, దేవిశ్రీ ప్రసాద్, నాగవంశీ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, నితిన్, కీర్తీ సురేశ్‌

‘‘అన్ని జంతువులూ నవ్వలేవు. కేవలం మనిషి మాత్రమే నవ్వగలడు అంటారు. అలాగే అన్ని జంతువులకు వస్తువులు బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే కనిపిస్తాయి. మనుషులకు మాత్రమే ఏడురంగులు చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న ఏడురంగులను చూపిస్తుంది’’ అన్నారు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్‌. నితిన్‌ , కీర్తీ సురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ్‌ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రివిక్రమ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాను. అర్జున్‌ , అను నాకు బాగా నచ్చారు. నేను తీసిన ‘అఆ’ సినిమాలో అఅ ఉన్నాయి. ఈ సినిమాలో (అర్జున్‌, అను) క్యారెక్టర్స్‌ ఉన్నాయి. ’అఆ!’ను మించి ‘రంగ్‌ దే’ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నితిన్‌  నాకు బ్రదర్‌. అతను నటించిన ఏ సినిమా అయినా హిట్‌ కావాలని కోరుకుంటాను. ఎలాంటి పరిస్థితులనుంచైనా పాటను ఇవ్వగలడు దేవిశ్రీ ప్రసాద్‌.. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’అని అన్నారు.

నితిన్‌ మాట్లాడుతూ – ‘‘ఈ వేదికపై నా ‘అఆ!’ సినిమా ఫంక్షన్‌  జరిగింది. దర్శకుడు వెంకీ ఈ సినిమాను బాగా తీశాడు. ఈ నిర్మాతలతో ఇది నా మూడో సినిమా. నా ఫ్లాప్‌ మూవీస్‌ తర్వాత నాకో హిట్‌ ఇస్తున్న నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర  నాగవంశీ, చినబాబులకు థ్యాంక్స్‌. దేవిశ్రీతో నాది ఫస్ట్‌ కాంబినేషన్‌ . మంచి ఆల్బమ్‌ ఇచ్చారు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘అర్జున్‌ , అను క్యారెక్టర్లకు ప్రాణం పోసిన నితిన్‌ , కీర్తీ సురేష్‌కు థ్యాంక్స్‌. 

కోవిడ్‌ కారణంగా కొన్ని నెలలు షూటింగ్‌లు జరగకపోయినా  చిత్రయూనిట్‌ జీతాలు చెల్లించారు నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ. నిర్మాతలంటే నాకు మరింత గౌరవం పెరిగింది. పీసీ శ్రీరామ్‌గారితో వర్క్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన దగ్గర నేను రోజుకో విషయం నేర్చుకున్నాను’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాలకు నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేయాల్సింది.. కుదర్లేదు. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ ‘రంగ్‌ దే’. నితిన్‌ కెరీర్‌లో ఈ సినిమా మరో హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement