ఎన్టీఆర్‌ 30 రోలింగ్‌ సూన్ | Trivikram Srinivas And Nagavamshi meets on NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ 30 రోలింగ్‌ సూన్

Jan 3 2021 12:59 AM | Updated on Jan 3 2021 4:14 AM

Trivikram Srinivas  And Nagavamshi meets on NTR - Sakshi

ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రెండో సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ వచ్చింది. తాజా చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరం సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశీ ఇద్దరూ ఎన్టీఆర్‌ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను షేర్‌ చేసి, ‘ఎన్టీఆర్‌ 30 రోలింగ్‌ సూన్‌’ అని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఇది పూర్తి కాగానే త్రివిక్రమ్‌ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాను యస్‌. రాధాకష్ణ, కల్యాణ్‌రామ్‌ నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement