త్రిషపై నటుడి అనుచిత వ్యాఖ్యలు.. హీరోయిన్‌ ఇలా చేసిందేంటి? | Trisha Krishnan Unexpected Response In Mansoor Ali Khan Issue | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: సారీ చెప్పలేదంటూ నటుడి యూటర్న్‌.. త్రిష నుంచి ఊహించని రెస్పాన్స్‌!

Published Sat, Dec 2 2023 4:55 PM | Last Updated on Sat, Dec 2 2023 5:06 PM

Trisha Krishnan Unexpected Response in Mansoor Ali Khan Issue - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మహిళా కమిషన్‌.. మన్సూర్‌పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు. మన్సూర్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.

ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్‌ కోసం మద్రాసు హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే అక్కడ నటుడికి చుక్కెదురైంది. దీంతో మన్సూర్‌ త్రిషకు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత మాత్రం తన మాటలను వక్రీకరించారంటూ తానెవరికీ సారీ చెప్పలేదని బుకాయించాడు. అంతేకాదు త్రిషతో పాటు ఆమె మద్దతుగా నిలబడ్డ కుష్బూ, టాలీవుడ్‌ చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తానని మాట్లాడారు. 

ఈ వ్యవహారం పక్కన పెడితే పోలీసులు మన్సూర్‌ అలీఖాన్‌ విషయంలో త్రిషను విచారించడానికి ఆమెకు లేఖ రాశారు. అందుకు త్రిష స్పందిస్తూ శుక్రవారంనాడు పోలీసులకు తిరిగి లేఖ రాశారు. అందులో మన్సూర్‌ అలీ ఖాన్‌ తనకు క్షమాపణ చెప్పారని ఆయనపై చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. మరి ఈ వ్యవహారం మున్ముందు ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి!

చదవండి:  శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్‌.. అందుకే టాస్క్‌లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement