Tollywood Young Heroes: వెండితెరపై సైనికులుగా పోరాడనున్న హీరోలు వీళ్లే

Tollywood Young Heroes As Soldiers In Upcoming Movies - Sakshi

వేరీజ్‌ దట్‌ మోడ్రన్‌ హెయిర్‌ స్టయిల్‌.. వాటీజ్‌ దిస్‌ మీసకట్టు.. వేరీజ్‌ దట్‌ లవర్‌ బోయ్‌ లుక్‌ అంటే... కట్‌ చేశా.. లుక్‌ మార్చేశా అంటున్నారు కుర్ర హీరోలు. మరి.. సైనికుడా? మజాకానా? సిల్వర్‌ స్క్రీన్‌ కోసం సోల్జర్లుగా మారిన ఈ హీరోలు ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోయారు. సోల్జర్‌.. ఆన్‌ డ్యూటీ అంటున్న వెండితెర సైనికుల గురించి తెలుసుకుందాం.

'వెంకీమామ’ (2019)లో కొన్ని సీన్ల కోసం సరిహద్దుకు వెళ్లొచ్చారు నాగచైతన్య. మళ్లీ ఇప్పుడు బోర్డర్‌కు వెళ్లొచ్చారు. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా హిందీలో ‘లాల్‌సింగ్‌ చద్దా’ అనే సినిమా రపొందిన సంగతి తెలిసిందే. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ది ఫారెస్ట్‌ గంప్‌’కి ఇది హిందీ రీమేక్‌. ఈ చిత్రంలో బాల అనే పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. కథ రీత్యా ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌లో ఆమిర్‌ ఖాన్, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్స్‌గా కనిపిస్తారు. సినివలో ఓ వార్‌ బ్యాక్‌డ్రాప్‌ ఎపిసోడ్‌ కూడా ఉంటుంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. హిందీతో పాటు తెలుగులోన ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

అలాగే హిందీలో నాగచైతన్య నటించిన తొలి సినిమా కూడా ‘లాల్‌సింగ్‌ చద్దాయే’ కావడం విశేషం. అయితే ఇందులో చైతూది స్పెషల్‌ రోల్‌. మరోవైపు విజయ్‌ దేవరకొండ ఫుల్‌ లెంగ్త్‌ సోల్జర్‌గా కనిపించనున్న చిత్రం ‘జేజీఎమ్‌’ (జేజీఎమ్‌ అంటే ‘జన గణ మన’ అనే ప్రచారం జరుగుతోంది). ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘లైగర్‌’ తర్వాత వెంటనే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్‌ దేవరకొండ చేస్తున్న సినిమా  ‘జేజీఎమ్‌’. ‘‘ఇండియన్స్‌ ఆర్‌ టైగర్స్, ఇండియన్స్‌ ఆర్‌ ఫైటర్స్, ఇండియన్స్‌ కేన్‌ రూల్‌ దిస్‌ వరల్డ్‌.. 

'జన గణ మన’... ఇది ‘జేజీఎమ్‌’ చిత్రం ప్రారంభోత్సవంలో విజయ్‌ దేవరకొండ చెప్పిన డైలాగ్‌. దీన్నిబట్టి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌ ఏ లెవల్లో ప్లాన్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా కశ్మీర్‌లోనే టైమ్‌ స్పెండ్‌ చేశారు దుల్కర్‌ సల్మాన్‌. ఎందుకంటే.. ‘సీతారామం’ సినివ కోసం. ‘మహానటి’ తర్వాత దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో చేస్తున్న రెండో స్ట్రయిట్‌ తెలుగు ఫిల్మ్‌ ఇది. నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తీసిన హను రాఘవపూడి ఈ ‘సీతారామం’ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్, సీత పాత్రలో హీరోయిన్‌గా మృణాళినీ ఠాకూర్, కీలక పాత్రలో అఫ్రీన్‌గా రషి్మకా మందన్నా కనిపిస్తారు.

‘సీతారామం’ బోర్డర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ అని తెలిసింది. ఈ చిత్రంలో సుమంత్‌ ఓ కీ రోల్‌ చేస్తున్నారు. సుమంత్‌ది కూడా సోల్జర్‌ పాత్ర అని సమాచారం. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో రపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ మలయాళ స్టార్‌ మమ్ముట్టి ‘ఏజెంట్‌’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రపొందుతోన్న ఈ సినిమాలో అక్కినేని అఖిల్‌ హీరో. ఈ చిత్రంలో మమ్ముట్టీది మిలిటరీ ఆఫీసర్‌ పాత్ర అని సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్‌ కానుంది. ఈ ముగ్గురే కాదు.. మరికొందరు తెలుగు హీరోలు కూడా సోల్జర్స్‌గా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది.

చదవండి: మందు తాగుతా, ఆ టైమ్‌లోనే కథలు రాస్తాను: ప్రశాంత్‌ నీల్‌

 దటీజ్‌ రామ్‌చరణ్‌, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top