ముగిసిన నవదీప్‌ విచారణ: కీలకంగా మారిన ‘పబ్‌’

Tollywood Drugs Case: Actor Navadeep Probe Finished - Sakshi

ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌ను కూడా విచారణ

9 గంటల పాటు వివరాల సేకరణ

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం 9 గంటలపాటు విచారణ చేసింది. నవదీప్‌తోపాటు ఎఫ్ లాంజ్ పబ్బు జనరల్ మేనేజర్‌ను కూడా విచారించారు. ఎఫ్ లాంజ్ పబ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2015,17 మధ్య కాలంలో పెద్దఎత్తున ఎఫ్ లాంజ్ పబ్‌లో పార్టీలు, ఆ పార్టీలకు పలువురు నటీనటులు హాజరయ్యారని గుర్తించారు. పార్టీలకు ముందు తర్వాత పెద్ద ఎత్తున క్లబ్ ఖాతాలోకి భారీగా నిధులు వచ్చాయని సమాచారం. కొంతమంది నటీనటులు పెద్ద ఎత్తున క్లబ్బు మేనేజర్‌కి డబ్బులు బదిలీ చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
చదవండి: లవ్‌ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్‌బుక్‌

మనీ ల్యాండరింగ్ నిబంధనల ఉల్లంఘనపై ఈడీ ప్రశ్నించింది. ఎఫ్ క్లబ్ వేదిక ద్వారా జరిగిన డ్రగ్స్ ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగారు. ఎఫ్ క్లబ్‌కు వ్యాపారానికి సంబంధించిన వివరాలు సేకరించారని సమాచారం. కెల్విన్, జిషాన్‌లు కలిసి పార్టీలకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని నడిపినట్టుగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఎఫ్ లాంజ్ పబ్‌ కీలకంగా మారింది. ఆ పబ్‌ లావాదేవీలు కూడా పరిశీలించారు. బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌, కెల్విన్‌, జిషాన్ ఖాతాలకు భారీగా ఎఫ్ లాంజ్ పబ్‌ నుంచి నిధులు బదలాయింపు జరిగాయని విచారణలో గుర్తించినట్లు సమాచారం. కెల్విన్, జీషాన్‌ల ఖాతాల నుంచి విదేశీలకు నగదు బదిలీ అయిట్టు గుర్తించారని తెలుస్తోంది.
చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్‌ హుష్‌కాకి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top