సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | The Trial Telugu Movie Streaming On This OTT Platform- Sakshi
Sakshi News home page

The Trial Telugu Movie OTT: ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Published Tue, Jan 9 2024 3:59 PM

Tollywood Crime Thriller Suddenly Streaming On This Ott Platform - Sakshi

యుగ్‌ రామ్, వంశీ కోటు, స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇంటరాగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌ 'ది ట్రయల్'. ఈ చిత్రానికి రామ్‌ గన్నీ దర్శకత్వం వహించారు. ఎస్‌ఎస్‌ ఫిల్మ్స్, కామన్‌ మేన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై స్మృతి సాగి, శ్రీనివాస్‌ కె. నాయుడు నిర్మించారు. లేడీ ఓరియంటెడ్‌ కథతో ఈ మూవీని రూపొందించారు. గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. 

తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‍గా ఓటీటీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో  స్ట్రీమింగ్‍కు‍ అవుతోంది. థియేటర్లలో మిస్సయినవారు.. ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్‌ జోనర్‌ ఇష్టపడేవారు ఓ లుక్ వేసేయొచ్చు. కాగా.. ఈ  చిత్రంలో ఉదయ్ పులిమె, సాక్షి ఉత్తాడ, జశ్వంత్ పెరుమాళ్ల, వజీర్ ఇషాన్ కూడా కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు.

ది ట్రయల్ కథేంటంటే..

'కథ రీత్యా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రూప, ఆమె భర్త అజయ్‌ ఓ అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్‌ కాలుజారి ఆ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపనే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెరకెక్కించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement