చాలా విలువైనది   | Sakshi
Sakshi News home page

చాలా విలువైనది  

Published Sat, Aug 19 2023 12:41 AM

Tollywood 2023: Otu movie first look release - Sakshi

హృతిక్‌ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఫ్లిక్‌ నైన్‌ స్టూడియోస్‌పై ఫ్లిక్‌ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ సినిమాకి ‘ఓటు’ అనే టైటిల్‌ ఖరారు చేసి, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌.

‘‘ఓటు విలువ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఫస్ట్‌ లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలో మా చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్‌. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: రామకృష్ణ.  

Advertisement
 
Advertisement