
టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) (Telugu Film Chamber of Commerce) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మెలోకి వెళ్లింది. దీంతో నిర్మాతలు కూడా కార్మికులకు అంత మొత్తం చెల్లించలేమని తేల్చేశారు. బయట ఉన్న ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఇప్పటికే వర్కర్లకు ఎక్కువ చెల్లిస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు.
కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్ తగ్గకపోవడంతో నిర్మాతలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్మాతలు కొత్త మార్గాలు అన్వేషించారు. ఇక నుంచి యూనియన్లతో సంబంధం లేకుండా నిర్మాతలే ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఆసక్తికలిగిన కొత్తవారిని వర్క్లోకి తీసుకోవాలని అనుకున్నారు. ఎంపిక అయిన వారిని పనికి తగినట్లు ట్రైయినింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పించాలని చూస్తున్నారు.
మొత్తం 22 విభాగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో ఎడిటింగ్, మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్, ఆర్ట్ వర్క్, కొరియోగ్రఫీ వంటివి కూడా ఉన్నాయి. ఆసక్తి వున్న వారు ధరఖాస్తు Atfpg.com చేసుకోవచ్చు. నిర్మాత అశ్వీనిదత్ కూడా ఆ నోటిఫికేషన్ లింక్‌నే షేర్ చేశారు. మీలో ఎవరైనా ఔత్సాహిక నిపుణులు, కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ్యత్వం కోసం రూ.లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నైపుణ్యం ఉన్న కార్మికులకు పని కల్పించడమే తమ ధ్యేయమని వారు పేర్కొన్నారు.
#Tollywood jobs for New talent pic.twitter.com/Tt1BVhCOpu
— devipriya (@sairaaj44) August 4, 2025