తంతిరం సినిమా విడుదల తేదీ ఫిక్స్‌ | Tantiram Movie Release Date Announced | Sakshi
Sakshi News home page

తంతిరం సినిమా విడుదల తేదీ ఫిక్స్‌.. పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌

Sep 22 2023 6:51 PM | Updated on Sep 22 2023 7:33 PM

Tantiram Movie Release Date Announced - Sakshi

తంతిరం సినిమా అక్టోబర్ 6న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది... శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి తదితరులు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించగా శ్రీకాంత్ కంద్రగుల (SK ) నిర్మాతగా ఉన్నారు. ఈ మధ్య చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు సూపర్‌ హిట్‌ స్థానాన్ని దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.

(ఇదీ చదవండి: Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి 45 ఏళ్ల సినీ ప్రస్థానం.. రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌)

ఈ సినిమా హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా, భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.  ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా కంటెంట్ మాత్రమే నమ్మిన ప్రొడ్యూసర్ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన దీనిని తెరకెక్కించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ను అందుకుంది.

ఆడియో రైట్స్ దక్కించుకున్న సరిగమ సంస్థ ఈరోజు జ్యూక్ బాక్స్ ద్వారా ఆడియో రిలీజ్ చేసింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా ఇప్పటికే పోటీ పడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌కు నార్త్ ఇండియాలో కూడా మంచి స్పందన లభిస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా రిలయన్స్ సంస్థ గ్రాండ్‌గా అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికి సిద్ధమయింది.

Advertisement
 
Advertisement
Advertisement