రూ.10 కోట్లతో అపార్ట్‌మెంట్‌ కొన్న టబు.. ప్రత్యేకతలు ఇవే! | Tabu Buys Rs 10 Crore Apartment In Mumbai | Sakshi
Sakshi News home page

రూ.10 కోట్లతో అపార్ట్‌మెంట్‌ కొన్న టబు.. ప్రత్యేకతలు ఇవే!

Apr 19 2026 1:51 PM | Updated on Apr 19 2026 2:23 PM

Tabu Buys Rs 10 Crore Apartment In Mumbai

సీనీ తారల్లో చాలా మంది తమ సంపాదనను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెడుతున్నారు. స్టార్‌ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు విలాసవంతమైన భవనాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత మంచి ధర వస్తే..వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా సీనియర్‌ నటి టబు కూడా ముంబైలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌ విలువ దాదాపు రూ. 10.40 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసమే టబు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందంట.  

ఆ అపార్ట్‌మెంట్‌ సముద్ర తీరానికి సమీపంలోనే ఉండడమే కాదు.. నగరం మొత్తం అందంగా కనిపించేలా  ఉంటుందట.  ఆ వెంచర్‌లో మొత్తం 2 టవర్స్‌ ఉన్నాయట. ఒక్కో టవర్‌ 24 అంతస్తులు ఉంటుంది. మొత్తం 126 నివాసాలు ఉండగా..అందులో ఒకటి టబు కొనుగోలు చేసింది. జిమ్‌, స్వీమ్మింగ్‌ పూల్‌తో పాటు రెండు కార్లు పార్కింగ్‌ చేసుకునేలా పార్కింగ్‌ స్తలం వచ్చిందట. ముంబైలో టబుకి ఇప్పటికే ఓ ఫ్లాట్‌ ఉంది. ఇది రెండోది. హైదరాబాద్‌లో కూడా టబుకి సొంతిల్లు ఉంది.

టబు సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్‌ బంగ్లా’ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే విజ‌య్ సేతు ప‌తి క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `స్ల‌మ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో న‌టిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement