
తెలుగువారు ఇద్దరు కలిసి కనిపించినా తెలుగులో మాట్లాడకపోవచ్చు. కొందరి విషయంలో మనం ఇలాంటి సంఘటనలు చూసే ఉంటాం. వారి కారణాలు చాలా ఉండవచ్చు. కొందరు ఇంగ్లీషు లేదా ఇతర భాషలను ఇష్టపడుతూ మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. వారు తమ భాషా పరిజ్ఞానం ఇతరులకు చూపించుకోవాలని కూడా తాపత్రయం పడుతుంటారు. అయితే, ఒక విదేశీయుడు స్వచ్ఛమైన తెలుగు భాషలో పాట పాడితే ఎలా ఉంటుంది..? అది కూడా తప్పులు, తడబాటు లేకుండా ఆలపిస్తే విన సొంపుగా ఉంటుంది. అలాంటి ఘటనే ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
స్వీడన్‌కు చెందిన దేవ్ ఒక లండన్‌లోని ఒక హోటల్‌లో కూర్చొని ఉండగా అక్కడికి మన హైదరాబాద్‌కు చెందిన యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇంతలో పరిచయం చేసుకుంటున్న క్రమంలో ఎక్కడి నుంచి వచ్చావ్ బ్రదర్ అని అడగ్గానే హైదరాబాద్ అని చెప్పాడు. దీంతో దేవ్ వెంటనే RRR సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ 'పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు' అంటూ పోలేరమ్మ జాతరలో పోతరాజులా ఊగిపోతూ పాట అందుకున్నాడు. ఇంకేముంది మన హైదరాబాద్ యువకుడు ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
స్వీడన్‌కు చెందిన దేవ్‌కు భారత్ అంటే చాలా ఇష్టం. తనకు హిందీతో పాటు తెలుగు, అస్సామీ వంటి భాషలు కూడా వచ్చు. గోవా, ముంబైలో ఎక్కువ రోజులు ఉన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తనకు బాగా నచ్చడంతో అందులోని సాంగ్‌కు అతను ఫ్యాన్ అయిపోయాడు. ఈ పాట కూడా ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో తనకు బాగా నచ్చి ఉండొచ్చు. విదేశీయుడు కావడంతో అతనికి కొన్ని సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో కూడా తను నటించాడు.