ఆకట్టుకుంటున్న ‘కన్నుల్లోన...’ సాంగ్‌ | Swa movie song launch | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘కన్నుల్లోన...’ సాంగ్‌

Jan 29 2022 5:22 AM | Updated on Jan 29 2022 8:10 AM

Swa movie song launch - Sakshi

మహేశ్‌ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్‌ పెండ్యాల, సిద్ధార్థ్‌ గొల్లపూడి, మానిక్‌ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘స్వ’. మను పీవీ దర్శకత్వం వహించారు. జి.ఎం.ఎస్‌ గాలరీ ఫిల్మ్స్‌ సంస్థలో జి.ఎం. సురేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. కరణం శ్రీ రాఘవేంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని  ‘కన్నుల్లోన..’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు. వినోద్‌ శర్మ, నాదప్రియ పాడారు. జీ.ఎం. సురేష్‌ మాట్లాడుతూ–‘‘మా చిత్రం ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నుల్లోన..’ పాట బాగా అలరిస్తోంది. ‘స్వ’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement