ఎవ‌రు.. ఎక్కడ.. ఎందుకు?.. థ్రిల్‌గా ఫీలయ్యా : సురేశ్‌ బాబు | Suresh Babu Comments On WWW Movie | Sakshi
Sakshi News home page

WWW Movie: థ్రిల్లింగ్‌గా ఉంటుంది: సురేశ్‌ బాబు

Aug 24 2021 4:18 PM | Updated on Aug 24 2021 4:24 PM

Suresh Babu Comments On WWW Movie - Sakshi

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా, ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్యంతో థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత సురేశ్‌ బాబు మాట్లాడుతూ.. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు చిత్రాన్ని క్రిస్పీ న‌రేష‌న్‌తో  మంచి పెర్‌ఫామెన్స్‌ల‌తో చాలా థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్ని, ఈ క‌రోనా వ‌ల్ల వర్చువల్ వరల్డ్ లో వ‌చ్చిన మార్పుల‌ని చ‌క్క‌గా చూపించారు. అంత‌ర్లీనంగా  ఒక మంచి ప్రేమ‌క‌థ కూడా ఉంది. ఆడియోకి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది`అన్నారు.  
(చదవండి: మేయర్‌ అభ్యర్థిగా సోనూసూద్‌.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్‌ హీరో’!)

చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ.. ‘మా బేన‌ర్‌లో రూపొందిన ఫ‌స్ట్ మూవీ  `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` చిత్రానికి సురేశ్‌ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా సురేశ్‌ బాబుగారికి మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ ఇది. గుహ‌న్‌గారి మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. అలాగే  అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్ద‌రు సెటిల్డ్ పెర్‌ఫామెన్స్ ఇచ్చారు. వారిద్ద‌రి కెమిస్ట్రి త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. త్వ‌రలో ట్రైల‌ర్ రిలీజ్ చేయనున్నాం. క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు కేవీ గుహన్ మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ విడుద‌ల‌వ‌డం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్‌, శివాణి ఇద్ద‌రు చాలా బాగా న‌టించారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి స‌పొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది` అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement