Sonu Sood Political Entry: పొలిటికల్‌ ఎంట్రీపై సోనూ సూద్‌ స్పందన

Actor Sonu Sood Clarity on His Political Entry Rumors - Sakshi

రియల్‌ హీరో సోనూ సూద్‌ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2022 లో జరిగే బృహత్‌ ముంబై ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా సోనూ సూద్‌ దిగబోతున్నారని, ఈ విషయం లో కాంగ్రెస్‌ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి రేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కొడుకు, నటుడు రితేష్ దేశ్‌ముఖ్, మోడల్, ఫిట్‌నెస్ పర్సనాల్టీ మిలింద్ సోమన్ తో పాటు సోనూ సూద్ ఉన్నట్లు తెలిసింది.

ఇక ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించబోతున్నట్లు, దాని కోసం చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ ఎంట్రీపై సోనూ సూద్‌ స్పందించాడు. ‘ఇది నిజం కాదు. నేను సాధారణ వ్యక్తిగా చాలా సంతోషంగా ఉన్నాను’అని ట్వీట్‌ చేశాడు. అయితే అత్యధిక మంది నెటిజన్స్‌ మాత్రం సోనూ భాయ్‌ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరికొంత మంది మాత్రం ఈ బురదలోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 

చదవండి: హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top