Surbhi Puranik: హీరోయిన్‌ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?

Surabhi Puranik White Lehenga Cost Will Surprise You - Sakshi

‘చలిగాలి చూద్దూ తెగ తుంటరీ.. (జెంటిల్‌మన్‌ సినిమా)’ అంటూ యువతను గిలిగింతలు పెట్టిన నటి సురభి పురాణిక్‌ గుర్తుండే ఉంటుంది..  వరుసగా మూడు సినిమాలు చేసి కాస్త స్లో అయింది. లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ బిజీ అయిపోయింది.. కన్నడ, తమిళ సినిమాలతో పాటు తెలుగు తెర మీదా కనిపించబోతోంది. తన యూనిక్‌ స్టయిల్‌ కోసం ఈ స్టార్‌ ఏ బ్రాండ్స్‌ను అనుసరిస్తుందో చూద్దాం..

కీర్తి కదిరె
హైదరాబాద్‌కు చెందిన కీర్తి కదిరె సెలబ్రిటీస్‌కు ఫేవరెట్‌ డిజైనర్‌. తన పేరు మీదే ఫ్యాషన్‌ లేబుల్‌ను క్రియేట్‌ చేసుకుంది. వెడ్డింగ్‌ కలెక్షన్స్‌కు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయ నేత కళ, ఆధునిక ప్రపంచ పోకడ.. ఈ రెండింటి పర్‌ఫెక్ట్‌ మ్యాచ్, మన్నికైన ఫాబ్రికే ఆ బ్రాండ్‌కి వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్‌లైన్‌లో లభ్యం.

ఫాష్యన్‌ జ్యూయెలరీ
ఇది కూడా హైదరాబాద్‌కు చెందిన బ్రాండే. వ్యవస్థాపకురాలు ఐశ్వర్య. 2017లో ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ మొదలైన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తన బ్రాండ్‌ జ్యూయెలరీ సేల్స్‌ను స్టార్ట్‌ చేసింది. ఇప్పటికీ ఇవే ఆ జ్యూయెలరీ అవుట్‌ లెట్స్‌. ఈ అవుట్‌ లెట్స్‌లాగే ఈ జ్యూయెలరీ ధరలూ అందుబాటులోనే ఉంటాయి. ఒకరకంగా అదే ఆ బ్రాండ్‌ వ్యాల్యూ. 

లెహెంగా సెట్‌  బ్రాండ్‌: కీర్తి కదిరె
ధర: రూ. 1,28,000
జ్యూయెలరీ: గులాబీ రంగు ముత్యాల సెట్‌
బ్రాండ్‌:  ఫ్యాషన్‌ జ్యూయెలరీ

వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ కూడా ఫాలో అవుతున్నాను. స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ వస్తే చేస్తాను. స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ విషయంలో విజయశాంతే నాకు స్ఫూర్తి.
– సురభి పురాణిక్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top