'సుందరాంగుడు' వచ్చేస్తున్నాడు

Sundarangudu Movie Release Date Out - Sakshi

కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్‌ గౌడ్, యం.యస్‌.కె. రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న  థియేటర్ లలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా కృష్ణ సాయి మాట్లాడుతూ.. ‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం.

గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ. ఇటీవల సుందరాంగుడు ప్రివ్యూ చూసిన సినీపెద్దలు , సెన్సార్ అధికారులు చిత్రయూనిట్ ను ప్రశంస‌లు కురిపించారు. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్‌ ట్రస్ట్‌’ కోసం ఖర్చు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top