సుధీర్‌ బాబు సినిమా.. మిస్డ్ కాల్‌తో ఐఫోన్‌, జీప్‌ గెలుచుకోండి | Sakshi
Sakshi News home page

సుధీర్‌ బాబు సినిమా.. మిస్డ్ కాల్‌తో ఐఫోన్‌, జీప్‌ గెలుచుకోండి

Published Wed, May 29 2024 3:13 PM

Sudheer Babu Harom Hara Movie Contest

సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల త్వరలో కానుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్‌ను మేకర్స్‌ ప్రకటించారు. జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సుమంత్ జి .నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందుగా మే 31న సినిమా విడుదలకు యూనిట్‌ ప్లాన్‌ చేసింది. అయితే, జూన్‌ 14న రిలీజ్‌ చేయనున్నట్లు మరోసారి చిత్ర యూనిట్‌ ప్రకటించి. ఈ క్రమంలో కొత్తపోస్టర్‌తో పాటు అదిరపోయే గుడ్‌న్యూస్‌ను కూడా షేర్‌ చేసింది.

మే 31న ఎక్కువ సినిమాలు విడుదల కానున్నడంతో ‘హరోం హర’ చిత్రాన్ని జూన్‌ 14కు వాయిదా వేశారు. ఈ సినిమాలో సుధీర్‌ బాబు సుబ్రహ్మణ్యం పాత్రల కనిపించనున్నారు. అయితే, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్‌ ఒక కాంటెస్ట్‌ను ప్లాన్‌ చేశారు. ఇందులో పాల్గొనాలనే వారు 08045936069 టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ కాల్ ఇస్తే చాలు. 

వారి వద్ద మీ నంబర్‌ సేవ్‌ అయిపోతుంది. అనంతరం లాటరీ పద్ధతిలో వారు విజేతలను ప్రకటిస్తారు. గెలుపొందిని వారు సుబ్రహ్మణ్యం జీప్ ,ఐ ఫోన్ 15 PRO, చేతక్‌ బైక్‌ను సొంతం చేసుకోవచ్చని మేకర్స్‌ తెలిపారు. దీంతో ఇప్పటికే భారీగా మిస్డ్‌ కాల్స్‌ ఇస్తున్నారు. సుధీర్‌ అభిమానులు కూడా దీనిని భారీగా  షేర్‌ చేస్తున్నారు. మే 30న  ‘హరోం హర’ ట్రైలర్‌ మహేశ్‌ బాబు చేతులు మీదుగా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement